HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకానికి రూ.5257.20 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో HNK జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. BJP ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.