BHPL: మున్సిపాలిటీ పరిధిలోని కాశీంపల్లి శివారు వడ్లోని వాగు పై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన చెక్‌డ్యాం నిర్మాణ పనులకు శనివారం ఉదయం MLA గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చెక్‌డ్యాం పూర్తయితే పరిసర గ్రామాలకు నీటి కొరత తీరుతుందని, వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.