నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.