TG: స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నిక వచ్చినా పోటీ చేసేది తానేనని.. ప్రజలు గెలిపించేది కూడా తననేనని MLA కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. తన రాజీనామాపై ప్రతిపక్షాలది అత్యుత్సాహమేనని విమర్శించారు. తుది నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కాగా పార్టీ ఫిరాయింపు అంశంలో కడియం శ్రీహరికి కూడా స్పీకర్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.