AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో మంగళవారం గ్రామ దేవత పారిపల్లెమ్మ అమ్మవారి పండగను నిర్వహించడానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.