AP: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయవ్యంగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా, బుధవారం నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.