E.G:కొవ్వూరు డివిజన్ పరిధిలో మంగళవారం నుంచి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాలు వేయనున్నట్లు డిప్యూటీ DMHO జె. సంధ్య ప్రకటనలో తెలిపారు. 14 నుంచి 15 ఏళ్ల లోపున్న 4,410 మంది బాలికలను ఇందుకోసం గుర్తించినట్లు చెప్పారు. అన్ని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.