NZB: పోతంగల్ నూతన తహసీల్దార్‌గా రంజిత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గంగాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు. కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.