దర్శకత్వంపై హీరో అల్లరి నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తానని, ఆ మూవీ ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా నిలిచిపోవాలన్నది తన కోరిక అని పేర్కొన్నాడు. కాగా అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ’12A రైల్వే కాలనీ’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.