TG: మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేటీఆర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నపై సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.