BHPL: గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఓ మహిళ ఇందిరమ్మ ఇంటిని కక్షతో నిలిపివేశారంటూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అన్ని అర్హతలు ఉన్నా MLA గండ్ర, అధికారులు ప్రొసీడింగ్ కాపీని రాత్రికి రాత్రి నిలిపివేశారని, ఎందుకు నిలిపారో సమాధానం చెప్పట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది.