ATP: కార్తీక మాసం ఉత్సవాలలో భాగంగా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో నేడు సా.6:30 గంటలకు భస్మాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ చంద్రమోహన్ తెలిపారు. తొలుత కాశీ విశ్వేశ్వరస్వామికి పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించి, అనంతరం ఉజ్జయిని తరహాలో భస్మాభిషేకం చేస్తారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు.