VSP: విశాఖలోని వన్ టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను ఈనెల 21 నుంచి మొదలు కానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 19 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కే. శోభారాణి బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 7న వేద సభ, 13న రథ యాత్ర, 18న మహా అన్నదానం, సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తామన్నారు.