MBNR: జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్వాల్ హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.