NLG: మొదటి భారత మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, శంకర్ నాయక్తో కలిసి ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ జీవితం ఎంతోమంది రాజకీయ నాయకులకు, మహిళా లోకానికి ఆదర్శమన్నారు.