SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సాయిబాబా ఆధ్యాత్మిక శక్తిని కొనియాడారు. కొన్ని దశాబ్దాల క్రితం ఈ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి దేశ విదేశాల భక్తులు కృషి చేస్తారని ఎవరూ ఊహించి ఉండరని ఆయన అన్నారు. విశ్వ ప్రేమ, ఆధ్యాత్మిక తేజస్సు ఉన్న బాబాతోనే ఇది సాధ్యమైందని పవన్ పేర్కొన్నారు.