ప్రముఖ నటి, ఎన్నో చిత్రాల్లో తల్లి పాత్రలతో మెప్పించిన తులసి తన సినీ ప్రస్థానానికి ముగింపు పలకనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో తాను నటన నుంచి వైదొలగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొంతకాలంగా ఆమె సినిమాలను తగ్గించుకుని, సాయిబాబా భక్తిలో ఉన్నట్లు పేర్కొంది.