KMR: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ ఏడఏ సుధా మాధురి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గాంధారి మండల కేంద్రంలో గల సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. అక్కడ ఉన్నా స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేసినా దానికి సంబంధించిన రసీదు ఇవ్వాలని చెప్పారు.