KRNL: పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ తెలిపారు. సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 65 ఫిర్యాదులు స్వీకరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడం, లోన్ మోసాలు, కుటుంబ సమస్యలు వంటి ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.