JNG: జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్టేషన్ ఘనపూర్లో ఇటీవల జరిగిన జూనియర్ విభాగ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కటకం లక్ష్మి ప్రసన్న, ఇజ్జగిరి దీక్షిత, ఎండీ సమీర్, దాచేపల్లి సృజల్లు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో డిసెంబర్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వారికి లభించింది.