WNP: జిల్లాలో వరి కొనుగోళ్లు కేంద్రాలన్నింటినీ వెంటనే ప్రారంభించాలని సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, రైతుల వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతులకు సత్వరమే డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అన్ని కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు వాడాలన్నారు.