ATP: గుత్తికి చెందిన డాక్టర్ ప్రియాంకను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసిన ఘటనలో ఆమె భర్త ప్రొఫెసర్ ధనుంజయకుమార్తో పాటు ఆయన తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు గుత్తి సీఐ రామారావు బుధవారం తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం ప్రియాంక వరకట్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించి కేసు నమోదు చేశామన్నారు.