సత్యసాయి: కదిరిలో రేపు లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వాహనాలను బైపాస్ మార్గాల ద్వారా మళ్లించనున్నారు. అనంతపురం, మదనపల్లి, హిందూపురం వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.