KKD: జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేస్తున్న 5 మంది దొంగలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ బిందు మాధవ్ మీడియాకు వెల్లడించారు. సుమారు 255.1 గ్రాముల బంగారు, 1760 గ్రాములు వెండి వస్తువులను వారి వద్ద నుండి రికవరీ చేశామన్నారు. దీని విలువ సుమారు రూ.51 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 9 మోటార్ సైకిళ్ళు, ఒక ఆటో కూడా సీజ్ చేశామని వెల్లడించారు.