NLR: ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం-1, 2, 3 పరిధిలో ఓటర్ల మార్పులు, చేర్పులపై మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్వో ఎల్. రామ్మోహన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఉదయగిరి ఎమ్మార్వో కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, 8 మండలాల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.