GNTR: ప్రజల సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు.