W.G. ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన HPV వ్యాక్సిన్ పంపిణీ సోమవారం ఎల్.బి.చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రిబ్బన్ కట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఆడబిడ్డ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.