తెలంగాణలో ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ ఫలితాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎంసెట్ ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి EAMCET 2023 ఫలితాలను ఉదయం 9.30 గంటలకు ప్రకటిస్తారు.
ఈ క్రమంలో ఎంసెట్ ఫలితాలను తనిఖీ చేసుకోవడానికి ప్రత్యక్ష లింక్ అధికారిక వెబ్సైట్ www.eamcet.tsche.ac.inపై క్లిక్ చేయండి. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి.
మే 10 నుంచి 14 మే 2023 వరకు జరిగిన TS EAMCET 2023 పరీక్షకు మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు హాజరయ్యారు. TS EAMCET ఫలితాల 2023 ఆధారంగా, విద్యార్థులు తదుపరి అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. BE, BTech, BPharm, PharmD, BSc, BFSc, BVSc వంటి వివిధ UG కోర్సులలో ప్రవేశం తీసుకుంటారు. అర్హులైన విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) నిర్వహిస్తారు.