TG: రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తమ ఎన్నికకు సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలను ఇద్దరు సభ్యులు అందుకున్నారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వారు ఈ సర్టిఫికేట్లను స్వీకరించారు.