అన్నమయ్య: పీలేరు సమీపంలోని ఎర్రావారి పాలెం మండలం నెరబైలు అడవి పరిసరాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. సాయిబులపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చులో చిక్కి మేతకు వచ్చిన రెండు ఏనుగులు మృతి చెందాయి. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి, వేటగాళ్ల చర్యల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.