SRD: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని MPDO సత్తయ్య అన్నారు. సోమవారం కంగ్టి మండలం భీమ్రా గ్రామంలోని పాఠశాలను ఆయన సందర్శించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బాబు , కార్యదర్శి సంజివ్ తదితరులు పాల్గొన్నారు.