GDWL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో రెండు నెలల పసికందు ప్రాణం పోయినా.. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతుంటే చట్టం ఎవరి కోసం పనిచేస్తోందని సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వీ.వీ నరసింహ అన్నారు. దీనిపై సోమవారం గద్వాల కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఘటన జరిగి చాలా రోజులైనా కారకులు నేటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాన్నారు.