KRNL: నందవరం మండలం రాయచోటి గ్రామంలో నిర్వహించిన పట్టాదారు పాస్బుక్ పంపిణీ గ్రామ సభలో MLA జయనాగేశ్వర్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. రైతులతో కలిసి భూమి సర్వే, సరిహద్దులను పరిశీలించి అనంతరం పట్టాదారు పాస్బుక్స్ను రైతులకు పంపిణీ చేశారు. అలాగే సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.