SKLM: సారవకోట మండలం ధర్మలక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండల విద్యాశాఖ అధికారి మధు వెంకటరమణ పాల్గొని ఈ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొని పాఠశాల ఆవరణ పరిశుభ్రతను చేపట్టారు.