నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సీతారాంపురంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఒక మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.