బాలీవుడ్ కపుల్ రాజ్ కుమార్ రావు, పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. పత్రలేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ 4వ వెడ్డింగ్ యానవర్సరీ రోజే పాప పుట్టిందని రాజ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వారికి నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, వారిద్దరూ 2021 NOV 15న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.