KDP: వరికుంటపాడు మండలం, జి. కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న ఇంటింటి లార్వా సర్వేను ఉదయగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్. గాజుల నౌషద్ బాబు తనిఖీ చేశారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా, అనవసరపు నీటి నిల్వలను గుర్తించి, నీటిని తొలగించారు. నీటి నిల్వ ద్వారా దోమల వృద్ధి చెందుతుంది, చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేసారు.