గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో 58వ జాతీయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను అసిస్టెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. పుస్తక పఠనంతోనే జ్ఞానం పెరుగుతుందని, పాఠకులు స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉండి పుస్తకాలు చదవాలని చంద్రశేఖర్ కోరారు. ప్రథమ శ్రేణి గ్రంథాలయ పాలకులు ఖయ్యూం, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.