కృష్ణా: చిన్నఎరుకపాడు గ్రామానికి చెందిన రూపారాణి కొంకేపూడి గ్రామం నుండి ఆటోలో ప్రయాణిస్తుండగా బిళ్లపాడు రైల్వే గేట్ దాటాక బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ ఆటోలో నుంచి పడిపోయినట్లు గుర్తించారు. వెంటనే బాధితురాలు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. CCTV ఫుటేజ్ ద్వారా బ్యాగ్‌ను తీసుకున్న వ్యక్తిని పోలీసులు చేదించి బాధితురాలికి నిన్న అందజేశారు.