అన్నమయ్య: చిన్నమండెంలో బుధవారం జరిగిన 3 లక్షల ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారురాలు ముంతాజ్ మాట్లాడుతూ.. వివాహమైనప్పటి నుంచి సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడ్డానని, సీఎం చంద్రబాబు నాయుడు దయతో ఇల్లు లభించిందని ఆనందభాష్పాలతో పేర్కొన్నారు. చంద్రబాబుకు తన తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.