AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. గతంలో కొన్ని కేంద్ర పథకాలు కూడా ఆగిపోయాయి. 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ పథకాలు ఇస్తున్నాం. ఒక్కరోజే 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తున్నాం. 2029 నాటికి పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలి’ అని వెల్లడించారు.