Beggar in Airport: ఎయిర్ పోర్టు బిచ్చగాడు.. రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
మనకు బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర బిచ్చగాళ్లు కనిపిస్తూ ఉంటారు. ఇక గుడి లాంటి ప్రదేశాల్లోనూ కొందరు అడుక్కుంటూ కూర్చోవడం చాలా సర్వసాధారణం. కానీ ఓ యువకుడు ఎయిర్ పోర్టులో బిచ్చగాడిగా మారాడు. ఆ బిచ్చం ఎత్తుకోవడం కూడా ఓ హైటె్ బిజినెస్ లా చేస్తున్నాడు. రోజుకి తక్కువలో తక్కువ రూ.50 నుంచి రూ.60వేలు సంపాదిస్తున్నాడు. మరి ఈ హైటెక్ బిచ్చగాడి గురించి మనమూ తెలుసుకుందామా..
అతని పేరు విగ్నేశ్. వయసు 27. బిటెక్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉగ్యోగం చేశాడు. జీతం కూడా బాగానే వచ్చేది. ఓసారి బెంగళూరు నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని విమానాశ్రయానికి వస్తుండగా విఘ్నేష్ పర్సు పోగొట్టుకున్నాడు. విమాన టికెట్ తన ఫోన్లోనే ఉన్నప్పటికీ చెన్నైలో దిగాక ఇంటికి వెళ్లేందుకు రూపాయి కూడా లేని పరిస్థితిని బెంగళూరు విమానాశ్రయం లాంజ్‌లో ఓ విదేశీయుడికి తన ఇబ్బంది గురించి చెప్పాడు. దాంతో అతను జాలిపడి రూ. 10 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో అతనికి ఈ హైటెక్ బిచ్చగాడు అవతారం ఎత్తాడు.
నీట్ గా తయారై ఎయిర్ పోర్టుకు వెళతాడు. ఒంటరిగా కనిపించే ప్రయాణీకులతో మాటా మంతీ కలుపుతాడు. కట్టుకథలు చెబుతాడు. జాలిగా మొహం పెడతాడు. దీంతో జాలిపడిన ప్రయాణీకులు ఇతనికి డబ్బులు ఇస్తుంటాడు. అలా రోజుకు రూ.50 నుంచి రూ.60వేలు సంపాదిస్తున్నాడీ హైటెక్ బిచ్చగాడు. ఆ డబ్బులతో జల్సాలు చేస్తుంటాడు. గత రెండేళ్లుగా అతను ఇదే పని చేస్తున్నాడు. చివరకు అతని దందా బయటపడటంతో పోలీసులకు చిక్కాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.