E.G: నిడదవోలు నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ.26,32,753 విలువైన CMRF & LOC పత్రాలను మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు. CMRF పేద ప్రజలకు వరమని వారి ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. CMRFను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.