ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే, పేలుడు జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే అరుణ్ జైట్లీ స్టేడియం ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ స్టేడియంలో రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. దీంతో పోలీస్ అధికారులుతో టచ్లో ఉన్నట్లు డీడీసీఏ కార్యదర్శి అశోక్ వెల్లడించారు.