తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు వల్ల తండ్రి, కొడుకు(Father and Son) మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు పిడుగుపాటుకు మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
స్థానికులు వివరాల మేరకు.. బిజినేపల్లి మండలంలోని వెలుగొండ గ్రామానికి చెందిన నాగయ్య (55), అతని కుమారుడు రమేశ్ (25) నివశిస్తున్నారు. వీరు మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకొని వరి పంటను సాగు చేసుకుంటున్నారు. వరి పంట కోత దశకు రావడంతో ఆదివారం పంట(Crop) చేను కోపిస్తున్నారు. ఆ సమయంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నాగయ్య, రమేశ్ ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగు(Lightning) పడడంతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబంలో విషాదం నెలకొంది.