AKP: నర్సీపట్నం సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి వద్ద వందమంది గర్భిణీ స్త్రీలకు స్వామివారి మహా ప్రసాదం, ప్రోటీన్ ఫుడ్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి నెల ఉచితంగా గర్భిణీలకు ప్రోటీన్ ఫుడ్ అందిస్తున్నామన్నారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరాం, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.