CM Jagan Shocked As RBI Withdraw Rs.2 Thousand Note
Kalva Srinivasulu: రూ.2 వేల నోట్లను ఆర్బీఐ విత్ డ్రా చేసుకోగా.. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్పై (cm jagan) టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ (jagan) వద్ద గుట్టలు గుట్టలుగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వాటిని పంచుతూ గెలవాలని సీఎం జగన్ అనుకున్నారని.. ఆర్బీఐ నిర్ణయంతో జగన్ ఆశ అడియాస అయ్యిందని వివరించారు.
రూ.2 వేల నోట్ల విత్ డ్రాకు గడువు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద మొత్తాల్లో బ్యాంకుల్లో జమ అయ్యే రూ.2 వేల నోట్ల వెనక ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టాలని ఆర్బీఐని కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu) కోరారు. వారి వివరాలు మీడియా ముఖంగా బయటపెట్టాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దుతో అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. ఇదే విషయం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తుచేశారు.
వ్యాపారాలు, రాజకీయాల్లో అక్రమంగా డబ్బు సంపాదించిన వారు పెద్ద నోట్లు ఎక్కువగా దాచుకునే అవకాశం ఉంది. పన్ను ఎగవేసేవారికి, నల్లధనం దాచుకునే వారికి పెద్ద నోట్ల వ్యవహారం మంచి అవకాశం అని.. ఇదే విషయం చంద్రబాబు (chandrababu) చాలా సందర్భాల్లో చెప్పారని కాల్వ శ్రీనివాసులు (Kalva Srinivasulu). తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలో చంద్రబాబు సభ్యుడు అని.. పలు కీలక సూచనలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో చలామణిలోకి వచ్చే పెద్ద నోట్లపై ఆర్బీఐ లోతుగా పరిశీలించాలని మరోసారి సూచించారు.