అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్నాడు. తన ఇల్లు రాయచోటిలోని రవి హాల్ వద్ద ఉందని చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు అతని కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఆసుపత్రికి రాలేదు. వైద్యుల సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆదివారం తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఆసుపత్రికి తెలపాలని కోరారు.