TPT: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు TTD అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమంతో ఆలయం అంతటా శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆలయం ప్రాంగణం, గోడలు, ఉపాలయాలను ప్రత్యేకంగా ప్రక్షాళన చేస్తారు. అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారని అధికారులు తెలిపారు.