KDP: అవయవ దానం కార్యక్రమాన్ని తన కుటుంబంతోనే మొదలు పెడుతున్నానని పొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి ప్రకటించారు. ఆదివారం పొద్దుటూరులో అవయవ దానంపై ర్యాలీ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న MLA తన అవయవాలను మరణానంతరం దానం చేస్తున్నట్లు అంగీకార పత్రంపై సంతకాలు చేసి నిర్వహకులకు అందజేశారు. తన కుటుంబ సభ్యులతోను అవయవ దానంపై సంతకాలు చేయించినట్లు ఆయన తెలిపారు.